హైదరాబాద్,అర్జున్ సమాచారం:
నడి రోడ్డు పై వ్యక్తిని దారుణంగా చంపే ప్రయత్నం చేసారు దుండగులు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఘటన జరిగింది. హమేర్(35) అనే వ్యక్తిపై హత్యయత్నం చేసారు. హమేర్ పై గంజాయి బ్యాచ్ కత్తితో దాడి చేసిందని సమాచారం. స్థానికులు బాధితున్ని హాస్పిటల్ కు తరలించారు.అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హమేర్ పై గతంలో పలు చోరీ కేసులు నమోదు అయినట్లు సమాచారం. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీలు కారణంగానే దాడి చేసినట్లు సమాచారం.
===========================